FbTelugu

గచ్చిబౌలి ఫేస్ బుక్ ఆఫీసు ముట్టడి

హైదరాబాద్: గచ్చిబౌలి రహేజా పార్కులోని ఫేస్ బుక్ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఫేస్ బుక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ బీజేపీ కి వంతపాడుతూ, కాంగ్రెస్ పార్టీ పై విద్వేష ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు.

ఫేస్ బుక్ కార్యాలయం ముందు కూర్చుని ఆందోళనకు దిగారు. ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్, అంకిదాస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులపై నాయకుల పై అభ్యంతరకరమైన పోస్టింగ్ పెడుతూ రెచ్చిగొడుతున్నారని ఆరోపించారు. అంకిదాస్ ను తక్షణమే ఫేస్ బుక్ డైరెక్టర్ పదవి తొలగించాలని డిమాండ్ చేశారు

You might also like