FbTelugu

గ్యాస్ ట్యాంకర్ బోల్తా… 13 మంది సజీవ దహనం

వాషింగ్టన్: ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. వంట గ్యాస్ (ఎల్పీజీ)తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 13 మంది సజీవ దహనం అయ్యారు.

గ్యాస్ ట్యాంకర్ ప్రయాణిస్తున్న సమయంలో బొల్తా కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే దహనమయ్యారు. అకస్మాత్తుగా ప్రమాదానికి గురవడంతో తప్పించుకునే వీలులేకపోయింది. డ్రైవర్ సహా 13మంది మంటల్లో కాలిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.