FbTelugu

నెల రోజుల్లో 4సార్లు పెరిగిన గ్యాస్ ధర

హైదరాబాద్: దేశంలో నెల రోజుల వ్యవధిలో బీజేపీ  ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లపై మోయలేని విధంగా భారం వేసింది. అచ్చేదిన్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం సచ్చేదిన్ గా మార్చిందని మహిళలు మండిపడుతున్నారు.

మూడు నెలల్లో ఏకంగా రూ.225 పెంపుదల వేసి గ్యాస్ అంటేనే భయపడే విధంగా చేసింది. వంట గ్యాస్‌ వినియోగదారుల నడ్డివిరిచేలా చమురు సంస్థలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగుసార్లు సిలిండర్‌ ధర పెరగటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా సిలిండర్‌ ధర మరో రూ.25 పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌ ధర రూ.846.50 నుంచి రూ.871.50కి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకపోవడంతో వినియోగదారులు మొత్తం ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుంది. గతంలో కనీసం రూ.200 నుంచి రూ.250 వరకు సబ్సిడీ చెల్లించేవారు. ఇప్పుడు చిల్లర పడేసిన విధంగా సబ్సిడీ చెల్లిస్తుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.