FbTelugu

మూడు తప్పిదాలతో గ్యాస్ లీకేజీ: ఎన్జీటీ కమిటీ

విశాఖ: ఎల్జీ పాలిమర్స్ పై ఎన్జీటీ విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై రిటైర్డు జడ్జీ శేషశయనా రెడ్డి కమిటీ అధ్యయనం చేసింది.

మానవ తప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వంటి మూడు కారణాలతో ప్రమాదం జరిగిందని నివేదికలో స్పష్టం చేసింది. విచారణ కమిటీ నివేదికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 24 గంటల వ్యవధిలో తెలియచేయాలని ఎన్జీటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్) ఎల్జీ పాలిమర్స్ ను సూచించింది. కమిటీ తన నివేదికలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని, తప్పిదాలను ఎండగట్టింది. ఐదు కీలక తప్పిదాలను ఎన్జీటీ సభ్యులు కమిటీ ఎత్తి చూపారు.

1) అత్యల్ప ఉష్ణోగ్రతల్లో స్టైరీన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ స్టోరేజ్ తగినంతగా ప్లాంట్ లో అందుబాటులో లేదు

2) ప్లాంట్ లో అక్సీజన్ ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ ను అమలు చేయడం లేదు.

3) స్టైరీన్ స్టోరేజ్ ట్యాంక్ లో టాప్ లేయర్స్ లో ఉష్ణోగ్రతలను పర్యవేక్షణ చేసే వ్యవస్థను పాటించడం లేదు.

4) ప్లాంట్ లో రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ను 24 గంటల పాటు ఆపరేట్ చేయడం లేదు

5)  ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ లోనూ, ప్లాంట్ లోని స్టోరేజ్ ట్యాంక్ వద్ద పర్సన్ ఇన్ చార్జ్ ల నిర్లక్ష్యం, తప్పిదం స్పష్డంగా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.