FbTelugu

విశాఖలో గ్యాస్ లీకేజీ… ఇద్దరు మృతి

విశాఖపట్నం :ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరువక ముందే మరో గ్యాస్ ప్రమాదం జరిగింది. పరవాడ సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ లో విష వాయువులు లీక్ అయ్యింది.

మంగళవారం తెల్లవారు జామున సాయినార్ లైఫ్ సైన్సెస్ రియాక్టర్ నుండి రసాయన వాయువు లీకైంది. ఏడుగురికి అస్వస్థతకు గురుయ్యారు. వెంటనే వారిని గాజువాక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు.మృతులు షిప్ట్ ఇన్ ఛార్జీ నరేంద్ర, గౌరీ శంకర్ గా గుర్తించారు. ఎల్వీ.చంద్రశేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీరామ్, ఎం.సూర్యనారాయణలు చికిత్స తీసుకుంటున్నారు. హైడ్రోజనల్ సల్ఫైడ్ అధికక మోతాదులో రావడంతో రియక్టర్ వద్ద ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని తెల్లవారుజామున పరిశీలించిన విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా సందర్శంచారు. వరుసగా గ్యాస్ లీకేజీ ఘటనలు జరగడంతో ప్రజలు బెంబెలెత్తి పోతున్నారు.

ప్రమాద ఘటనపై నిగ్గు తేల్చేందుకు నలుగురు అధికారులతో జిల్లా కలెక్టర్ కమిటీ నియమించారు. ఈ ఘటనపై ఎంపీ వి.విజయసాయి రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ను అడిగి తెలుసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.