FbTelugu

నంద్యాలలో గ్యాస్ లీకేజీ… ఒకరి మృతి

కర్నూలు: నంద్యాల పట్టణ శివారులో ఉన్న ఎస్పీవై ఆగ్రోస్ కంపెనీ లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయి అందులో పని చేస్తున్న జనరల్ మేనేజర్ శ్రీనివాస రావు మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు.

మృతుడి తో పాటు ఉన్న మరో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని ఆయన అన్నారు. కంపెనీ లోపల గ్యాస్ లీక్ అయిందని, బయట గ్యాస్ లీక్ ప్రమాదం లేదన్నారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని, అన్ని రక్షణ చర్యలను తీసుకున్నామన్నారు. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, పరిశ్రమలు, వైద్య శాఖ అధికారుల ద్వారా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ వీరపాండియన్ వివరించారు
విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని ఆయన తెలిపారు. పరిస్థితిని స్వయాంగా పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ చెప్పారు.

You might also like