FbTelugu

రూమ్ లో గ్యాస్ హీటర్.. 8 మంది మృతి

నేపాల్ పర్యటనకు వెళ్లిన కేరళకు చెందిన 8 మంది అక్కడే ఓ హోటల్ లో మృతి చెందిన ఘటన నేపాల్‌లోని దామన్‌లో చోటుచేసుకుంది. మక్వాన్‌పూర్‌ ఎస్పీ సుశీల్‌ సింగ్‌ రాథోడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ కు పర్యటన కోసం వచ్చిన 8 మంది కేరళ వాసులు ఓ హోటల్ గదిలో బసచేస్తున్నారు. కాగా వారు ఒకే సారి మృత్యువాత పడ్డారు. అయితే వారున్న రూములో గ్యాస్‌ హీటర్‌ ఉపయోగించారు. దీంతో గ్యాస్ హీటర్‌ ఉపయోగించడంతో శ్వాస ఆడకపోవడం వల్లే వారు చనిపోయి ఉంటారని ప్రథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More