FbTelugu

అలిపిరి దాకా గరుడ వారధి: టిటిడి ఛైర్మన్

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగిస్తామని టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. నాలుగు వరుసల్లో నాలుగు కిలోమీటర్ల పొడవునా దీన్ని నిర్మాణం చేస్తున్నామన్నారు.

కరోనా కారణంగా కల్యాణమస్తు కార్యక్రమాన్ని మే నెలలో పునఃప్రారంభించలేకపోయామని, త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. టిటిడి పాలక మండలి శనివారం నాడు భేటీ అవుతోందని, ఈ భేటీలో గరుడ వారధి పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని సుబ్బారెడ్డి వివరించారు. కరోనా మహమ్మారితో దర్శనాల సంఖ్యను కుదించామని, పెంపుదలపై తీర్మానం చేస్తామన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ ఏడాదిన్నర కాలంగా తిరుమలలో అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించమన్నారు. కరోనా వల్ల కొన్ని నిర్ణయాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఏపితో పాటు తెలంగాణలో ఎస్సి, ఎస్టి, బిసి కాలనీల్లో 500 ఆలయాలను నిర్మించే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.