FbTelugu

గరీబ్ కల్యాణ్ పథకం పొడిగింపు: కేంద్ర కేబినెట్

ఢిల్లీ: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని మరో మరో 5 నెలల పాటు పొడగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా దేశంలోని 81 కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూరనున్నది. ప్రతినెలా ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమలు, ఒక్కో కుటుంబానికి 1కేజీ పప్పును ఉచితంగా అందించనున్నారు.
నవంబర్ చివరి వరకు అర్హులైన పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూషన్‌ను జూన్ నుంచి ఆగస్టు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల 72 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుండగా, కేంద్రంపై అదనంగా రూ.4860 కోట్ల భారం పడనున్నది.

వ్యవసాయరంగం లో మౌలిక వసతుల కల్పనకు రూ.1 లక్ష కోట్లను కేటాయింపునకు ఆమోదం తెలిపారు. ఇన్సూరెన్స్ రంగాన్ని బలపరిచేందుకు ప్రభుత్వం నిర్వహించే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.12,450 కోట్ల మూలధనం సమకూర్చేందుకు ఆమోదం లభించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.