FbTelugu

ఛీ ఛీ… కాంట్రాక్టర్ పై చెత్త గబ్బు పడింది!

ముంబయి: కాంట్రాక్టర్లు తమకు అప్పచెప్పిన పని సకాలంలో చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులకు డబ్బులు ముట్టచెబుతున్నాం కదా అని ఇష్టమున్నట్లుగా పనిచేస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు ఆదేశించినా, ప్రజలు నిలదీసినా పనులు చేయడం లేదు. అలాంటి కాంట్రాక్టర్ కు శివసేనకు చెందిన ఎమ్మెల్యే ఊహించని షాక్ ఇచ్చాడు. వర్షాకాలం ప్రారంభానికి ముందు నగరంలోని మురికి కాలువల్లో, వర్షపు నీటి కాలువల్లో పూడిక తీయిస్తారు. పేరుకుపోయిన టన్నలు కొద్దీ చెత్త, మట్టిని తొలగిస్తారు. ఇందుకోసం బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. ఈ ఎంపిక ఎండాకాలంలోనే పూర్తిం చేసి పనులు అప్పగిస్తారు. వర్షాకాలం ప్రవేశించే లోపు ఈ పనులు పూర్తి చేయాలి. కాని ఒక కాంట్రాక్టర్ తనకు అప్పగించిన పనిచేయకపోవడం స్థానిక ఎమ్మెల్యే అయిన దిలీప్ లాండేకు పిచ్చి కోపం వచ్చింది. సదరు కాంట్రాక్టర్ ను పిలిపించి పని ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు.
ఆగ్రహించిన ఆయన కాంట్రాక్టర్ ను చండీవాలాలో రోడ్డుపై కూర్చోబెట్టించాడు. కార్యకర్తలను పురమాయించి కాలువలో నుంచి చెత్త చెదారం తీయించి ఆయన మీద పోయించాడు. వద్దు వద్దు అని రోదించినప్పటికీ పట్టించుకోకుండా చెత్తను వేయించడంతో ఒళ్లంతా మురికిగా మారింది. కాంట్రాక్టర్లను హెచ్చరించేందుకే ఇలాంటి పనులు చేయించానని, ఇకనుంచి జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో ఈ చర్యకు దిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.