FbTelugu

స్టీలు ప్లాంటు ముగిసిన అధ్యాయం: గంటా శ్రీనివాస్

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ అమ్మకం నిర్ణయం జరిగిపోయింది.. ఇక ఇది ముగిసిన అధ్యాయం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖను వైసీపీ, బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

వైసీపీ నేతలు మభ్యపెట్టినా ఎవరూ నమ్మరని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారమిస్తున్నామని నిన్న పార్లమెంట్‍లో కేంద్రం ప్రకటించిందన్నారు. స్టీల్ ప్లాంట్‍ను ప్రైవేటీకరించి చరిత్రహీనులుగా మిగలొద్దని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా అందరూ ఒక మాటమీదకు రావాల్సిన అవసరం ఉందని, ప్రధానితో మాట్లాడే అవకాశం అనేక సార్లు వచ్చినా స్టీల్ ప్లాంట్‍పై జగన్ ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు. జగన్ చొరవ తీసుకుంటే టీడీపీ కూడా వెనుక ఉంటుందని చంద్రబాబు కూడా చెప్పారు. ఇప్పటికైనా జగన్ జోక్యం చేసుకోవాలని, ఏపీ బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడినంత మాత్రాన జనసేన అధినేత కొణిదెల పవన్ బాధ్యత అయిపోలేదన్నారు. పవన్ కల్యాణ్ కూడా స్పందించాలి, బడ్జెట్ సమావేశాల్లో నా రాజీనామాను ఆమోదింపజేసుకుంటానన్నారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని, రాజీనామాలు చేస్తేనే కేంద్రం దిగి వస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.