FbTelugu

విశాఖ స్టీల్ పై కేటీఆర్ తో గంటా భేటీ

హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తో ఇవాళ అసెంబ్లీలో భేటీ అయ్యారు.

శాసన సభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్‌తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఇటీవలే కేటీఆర్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తన మద్దతు తెలపడంతో సమావేశమయ్యేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు. విశాఖ స్టీల్ ఉద్యమానికి మద్దతు పలికిన నేపథ్యంలో కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయనను కలిసినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖపట్నం వస్తామని కేటీఆర్ చెప్పారన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అందరి మద్దతును కూడగడుతున్నట్లు ఆయన తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.