FbTelugu

గంగూలీ త్వరగా కోలుకోవాలి: నగ్మ

ఇవాళ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ(భారత క్రికెట్ నియంత్రణ బోర్డు) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖ సీనియర్ సినీ నటి నగ్మ ట్వీట్ చేశారు. గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త విన్న అనేకమంది ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

గంగూలీని పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా వుడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.