FbTelugu

గంగూలీ త్వరగా కోలుకోవాలి… పలువురి ఆకాంక్ష..

కొలకత్తా: బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటు వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా సభ్యులు మొదలు పలువురు నాయకులు మీడియా ముఖంగా స్పందించారు.
సౌరవ్ గంగూలీకి స్వల్ప గుండెపోటు రావడంతో ఇవాళ కొలకత్తాలోని ఉడ్ ల్యాండ్ హాస్పిటల్ కు హుటాహుటిన తరలించారు.

కార్డియాలజిస్టు డాక్టర్ సరోజ్ మొండల్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహించింది. ఈ వార్త తెలియడంతో పలువురు ఉలిక్కిపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. గంగూలీ ఇప్పుడు బాగానే ఉన్నారని, ఇలాంటి సమస్య ఉంటుందని ఊహించలేదన్నారు. గంగూలీ చక్కగా ఉన్నారని, ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉన్నారని గవర్నర్ జగదీప్ ధన్కర్ అన్నారు.
ఆయనకు రెండు బ్లాకేజెస్ ఉన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖులు, క్రికెటర్లు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.