FbTelugu

టీ20 మ్యాచ్ పై స్పష్టతనిచ్చిన గంగూలీ

Ganguly-made-clear-on-the-T20-match

టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య నవంబర్ 3న ఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఈ రోజు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటన చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో వేదికను మార్చుతారని ప్రచారం సాగుతుండగా గంగూలి ఈ ప్రకటన చేశారు. ‘క్రికెట్‌ కు ఆతిథ్యమివ్వడం కన్నా కాలుష్యమే ఢిల్లీ వాసులకు పెద్ద సమస్య’ అంటూ ఎంపీ, మాజీ క్రికెటర్ తాజాగా గంభీర్‌ ట్వీట్‌ చేయడంతో అక్కడ మ్యాచ్‌ నిర్వహణపై మరిన్ని ప్రశ్నలు తలెత్తిన విషయం తెలిసిందే.. కాగా ఇక గంగూలీ ప్రకటనతో ఢిల్లీలోనే మ్యాచ్ ఉంటుందని స్పష్టమైంది.

You might also like