FbTelugu

యోగికి గ్యాంగ్‌స్ట‌ర్ స‌వాల్‌!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నేరాల‌కు పుట్టిల్లు.  ద‌శాబ్దాలుగా కుల‌, మ‌తాల‌కు విడిపోయి కొట్టుకులాడ‌టం సాధార‌ణంగా మారింది. ముఠాలుగా మారి ఆధిప‌త్యం కోసం కొట్టుకు చ‌చ్చేంత‌గా మారారు. రాజ‌కీయ పార్టీలు కూడా బ‌ల‌వంతుల‌ను త‌మ వైపు తిప్పుకుని చ‌క్రం తిప్పేవారు. మాయావ‌తి హ‌యాంలో ఇది పీక్‌స్టేజ్‌కు చేరింది. నేర‌స్తులు చెల‌రేగారు. జైళ్లు కేవ‌లం విలాస‌మందిరాలుగా భావించారు. కేసులు ఇట్టే వీగేవి. సాక్షులు న‌డిబ‌జార్లో ర‌క్త‌పు ముద్ద‌లుగా ప‌డేవారు. యోగి సీఎం అయ్యాక మొద‌ట క్రిమిన‌ల్ గ్యాంగ్‌ల ఏరివేత‌కు పోలీసుల‌కు పూర్తి అధికారాలిచ్చాడు. అంతే.. రౌడీ క‌నిపిస్తే కాల్చివేత‌. గ్యాంగ్‌స్ట‌ర్ వెన్నులో వ‌ణ‌కు.. వేలాదిమంది రౌడీ, క్రిమిన‌ల్స్ పెట్టాబేడా స‌ర్దుకుని అజ్ఞాతంలోకి చేరారు.

ఇటువంటి స‌మ‌యంలో కాన్పూర్‌లో గ్యాంగ్‌స్ట‌ర్‌గా పేరుపొందిన వికాస్‌దూబే.. ఏకంగా 8 మంది పోలీసుల‌ను కాల్చిచంపి యోగి ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరాడు. బిక్రూగ్రామ అడ్డాగా చేసుకుని ఇత‌డు ప్ర‌యివేటు ఆర్మీను ఏర్పాటు చేశాడు. ఆధునిక ఆయుధాలు స‌మ‌కూర్చుకుని హ‌త్య‌లు, భూదందా. పంచాయ‌తీలు, వ‌సూళ్లు కాదంటే హ‌త్య‌లు వంద‌ల సంఖ్య‌లో దారుణాల‌కు తెగ‌బ‌డ్డాడు. అయినా ఏ కేసులోనూ శిక్ష‌ప‌డ‌లేదు. పోలీసులు ఇత‌డిపై ఛార్జిషీటు దాఖ‌లు చేసేందుకు వెనుకాడారు.  43 ఏళ్ల వ‌య‌సు గ‌ల వికాస్ ర‌క్త‌చ‌రిత్ర‌కు 1990లో చేసిన హ‌త్య‌తో బీజం ప‌డింది. 2001లో రాష్ట్ర మంత్రిని పోలీసుల క‌ళ్లెదుట‌.. ఠాణాలో హ‌త్య చేయ‌టంతో తిరుగులేని గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఎదిగాడు.  యూపీ రాజ‌ధాని ల‌క్నో స‌మీపంలోని బిక్రూ గ్రామంలో పాగా వేశాడు.  అక్క‌డి ప్ర‌జ‌ల‌ను బెదిరించి స్థ‌లాలు ఆక్ర‌మించి పేద్ద ఇంటిని క‌ట్టాడు. దాన్నే డెన్‌గా మార్చి సెటిల్‌మెంట్ల‌కు దిగుతున్నాడు.

ఓ హ‌త్య‌కేసులో ఇత‌డిని అరెస్ట్ చేసేందుకు సుమారు 20-30 మంది పోలీసులు బ‌య‌ల్దేరారు.   పోలీసుల‌ను త‌ప్పుదారి ప‌ట్టించాడు. ముందుగానే గ్రామ‌స‌రిహ‌ద్దుల్లో అడ్డంకులు ఏర్పాటు చేశాడు.  వాటిని తొల‌గించిన పోలీసులు అత‌డి ఇంటి వ‌ద్ద‌కు చేర‌గానే.. అప్ప‌టికే మేడ‌ల‌పై మాటు వేసిన ఆ గ్యాంగ్ పోలీసుల‌పై బుల్లెట్ల వ‌ర్షం కురిపించారు.  న‌లుగురు పోలీసుల‌ను గొడ్డ‌ళ్ల‌లో నరికి తుపాకీల‌తో కాల్చి చంపారు. దాదాపు గంట‌న్న‌ర‌పాటు సాగిన మార‌ణ‌కాండ‌లో 8 మంది పోలీసులు మ‌ర‌ణించారు.  యోగీ సీఎం అయ్యాక‌.. రౌడీల‌కు బెయిళ్లు దూర‌మ‌య్యాయి. దారికి రానివారికి బుల్లెట్లు రుచిచూపుతున్నారు. ఇప్ప‌టికే దాదాపు 1000 మంది క్రిమిన‌ల్స్ ఎన్‌కౌంట‌ర్‌తో హ‌త‌మ‌య్యార‌ని అంచ‌నా. కానీ వికాస్‌దూబే వంటి వాడిని పెంచిపోషించిన నాటి మాయావ‌తి స‌ర్కారు ఇప్ప‌టికీ అత‌డిని కాపాడుతూనే ఉంటుంద‌ట‌. ఇత‌డి భార్య లోకల్ పాలిటిక్స్‌లో కీల‌కంగా ఉండ‌ట‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ. ప్ర‌స్తుతం ఇత‌డి వ‌య‌సు 43 సంవ‌త్స‌రాలు.  నూనూగు మీసాల వ‌య‌సులోనే నేరాల‌కు దిగిన ఇత‌డు ఏకంగా ప్ర‌యివేటు సైన్యాన్ని ఏర్పాటు చేసేంత‌గా ఎదిగాడు. హ‌త్య‌లు, కిడ్నాప్‌లు, క‌బ్జాలు య‌ధేచ్చ‌గా సాగించాడు. తాను ఎక్క‌డ‌కు వెళ్లినా ప‌క్క‌నే ఇద్ద‌రు లాయ‌ర్లు ఉండేవారట‌. ఎంత పెద్ద కేసున‌మోదుచేసినా వెంట‌నే బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చేవాడు.

మూడ్రోజ‌లుగా త‌ప్పించుకు తిరుగుతున్న వికాస్‌దూబే త‌ల‌పై ఏకంగా రూ,50000 బ‌హుమ‌తి ప్ర‌క‌టించారు.   యోగీ ప్ర‌భుత్వం కాల్పుల్లో మ‌ర‌ణించిన పోలీసుల కుటుంబాలు ఒక్కొక‌రికి రూ.కోటి  ప్ర‌క‌టించింది. కానీ యూపీ ప్ర‌జ‌లు మాత్రం.. గ్యాంగ్‌స్ట‌ర్‌కు స‌రైన స‌మాధానం ఎన్‌కౌంట‌ర్ మాత్ర‌మే అంటున్నారు. వాస్త‌వానికి ఇది యోగీకు చాలా కీల‌కం. ఏ మాత్రం వికాస్‌ను క‌ట్ట‌డి చేయ‌క‌పోయినా మ‌రికొంత‌మంది వికాస్‌దూబే లు పోలీసుల‌పై గురిపెడ‌తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.