FbTelugu

యువతి కోసం గ్యాంగ్ వార్

పోలీసుల అప్రమత్తతో తప్పిన ప్రమాదం

గుంటూరు: బెజవాడ ఘటన మరువక ముందే గుంటూరు లో మరో గ్యాంగ్ వార్ తలెత్తింది. పోలీసులకు సమాచారం అందడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

కాలేజీ యువతి విషయంలో ఇరువర్గాల యువకులకు తలెత్తిన వివాదం కాస్తా ముదిరింది. ఆదివారం రాత్రి సమయంలో ఓ గ్రౌండ్ వేదికగా మాట్లాడుకుందాం రమ్మంటూ యువకులు బాహాబహికి దిగారు. గ్రౌండ్ లో యువకులు ఉన్నారని సమాచారం మేరకు అరుండల్ పేట పోలీసులు మెరుపు దాడి చేశారు.

ఇరువర్గాల యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి కర్రలు, హాకీ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల లో రెండు గ్రూపుల యువకులు ఇంజనీరింగ్ చదువుతున్నారు.

You might also like