హైదరాబాద్: కరోనా కష్టకాలంలోనూ కొందరు కేటుగాళ్లు కరోనా పేషెంట్లకు ఎంతో అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లతో వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో అనుమతుల్లేకుండా ఆక్సీజన్ సిలిండర్లను అమ్ముకుంటున్న ముఠా పోలీసులకు పట్టుబడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి అనుమతులు లేకుండా సిలిండర్లను అమ్ముతున్న ఓ ముఠాపై టాస్క్ ఫోర్స్ దాడులు జరిపింది. ఈ సందర్భంగా 34 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠా ఒక్కొక్క సిలిండర్ కు లక్షల్లో వసూలు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేశారు.