FbTelugu

దైవదర్శనానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్

* మరో నిర్భయ తరహా ఘటన
* ఆలయ పజారి శిష్యులపైనే అనుమానం
లక్నో: ఎనిమిదేళ్ల క్రితం దేశ రాజధానిలో చోటుచేసుకున్న నిర్భయ ఘటనను తలపించేలా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బదౌన్ జిల్లా, ఉఘాటికి చెందిన ఓ మహిళ(50) రెండ్రోజుల క్రితం(జనవరి 03న) సాయంత్రం ఓ ఆలయానికి వెళ్లింది. అర్ధరాత్రి 12గంటల తర్వాత ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి.. మీ భార్య బావిలో పడి తీవ్ర గాయాలపాలైందంటూ పూజారి, అతని శిష్యులు సదరు మహిళను అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. అసలేం జరుగుతుందో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. ఇంతలోనే తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది.

ఆమె శరీరంపై, జననాంగాలపై తీవ్ర గాయాలు కనిపించడంతో వెంటనే ఉఘాటి పోలీసులకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టమ్‌ రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆలయానికి వెళ్లిన ఆ మహిళపై అత్యంత దారుణంగా కొందరు అత్యాచారానికి పాల్పడ్డారని, అత్యాచారం అనంతరం మహిళ జననాంగాల్లో ఇనుప రాడ్లు దూర్చి గాయపర్చడంతో పాటూ పక్కటెముకలను విరిచేసినట్లు తేలింది. బాధితురాలిని కారులో ఆమె ఇంటికి తీసుకొచ్చిన పూజారి, అతని శిష్యులే ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376d(గ్యాంగ్ రేప్), 302(హత్య) కింద వారిపై కేసులు నమోదు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.