FbTelugu

రిహన్నా రొమ్ముల కింద గణేషుడు

న్యూఢిల్లీ: రైతుల ఉద్యమానికి మద్దతుగా ట్వీట్ చేసి కేసులను ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సింగర్ రిహన్నా మరో వివాదానికి తెరదీశారు. ఇవాళ ఆమె పోస్టు చేసిన టాప్ లెస్ ఫొటోలో రొమ్ముల కింద వినాయకుడి విగ్రహం బొమ్మను ప్రదర్శించింది.
వజ్రాలు పొదిగిన నెక్లెస్ కు వినాయకుడి ప్రతిమ ను పెట్టి, టాప్ లెస్ గా కనిపించడంతో హిందువులు భగ్గుమంటున్నారు. ఆమెకు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు.

ఎంతో భక్తితో పూజించే ప్రతిమను ఇలా అసభ్యంగా ప్రదర్శించడమేంటనీ పలువురు మండిపడుతున్నారు. కేవలం హిందుత్వాన్ని ఎందుకు ఎగతాళి చేస్తున్నారంటూ మరొక నెటిజన్ ప్రశ్నించారు. రైతులకు మద్దతు ఇస్తున్నావు కదా దానికి గుర్తుగా నిషాన్ సాహిబ్ పెండెంట్ ఎందుకు పెట్టుకొలేదని మరొకరు నిలదీశారు. కళా సౌందర్యం పేరుతో హిందు మతాన్ని వాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.