FbTelugu

గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

కేఫ్ టౌన్: స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆశిఖ్ లతా రామ్ గోబింద్ కు డబ్బులు ఎగవేసిన కేసులో ఏడేళ్లు జైలు శిక్ష చేసింది. దక్షిణాఫ్రికా దేశంలో ఉంటున్న ఆమె గాంధీ పరువు గంగలో కలిపింది.
గాంధీ మనుమరాలు ఈలా గాంధీ, మేవా రామ్ గోబింద్ ల కుమార్తె లతా రామ్ గోబింద్. ఈమె దక్షిణాఫ్రికాలో ఉంటున్నారు. ఇండియా నుంచి ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చిన గూడ్స్ కు కస్టమ్స్ మాఫీ చేయిస్తానని చెప్పి లతా వ్యాపారవేత్త అయిన ఎస్ఆర్.మహారాజ్ నుంచి రూ.3.22 కోట్లు లంచం కింద తీసుకున్నది.

కొద్ది రోజులుగా ఆమె బ్రోకర్ పనులు నిర్వహిస్తున్నదని అంటున్నారు. డబ్బులు తీసుకున్న పని చేయకపోవడంతో విసిన మహారాజ్ డర్బన్ కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో విచారణ తరువాత దోషిగా తేలడంతో డర్బన్ కోర్టు లతాను దోషిగా ప్రకటించింది. వ్యాపారిని మోసం, ఫోర్జరీ చేసినందుకు ఆమెకు డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించడం తో పాటు శిక్షపై పై కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా తుది తీర్పునివ్వడం గమనార్హం. ఈ మధ్యకాలంలో స్వాతంత్ర్య సమరయోధుల వారసులు బ్లాక్ మార్కెటింగ్, బ్లాక్ మేయిల్, మోసం చేయడం, సెటిల్ మెంట్లలో తలదూర్చుతూ వారి ప్రతిష్టకు మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.