FbTelugu

ఫేస్ బుక్ లో 14 ఏళ్ల బాలికకు గాలం

విశాఖపట్నం: ఓ యువకుడు ఫేస్ బుక్ లో 14 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పాటు చేసుకుని నమ్మించి మోసం చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలికకు ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయమైనాడు.

తన పరిచయాన్ని స్నేహంగా మార్చినట్టు నమ్మించి హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడే రెండ్రోజుల పాటూ.. బాలికపై లైంగిక కోర్కెలను తీర్చుకొని పంపించి వేశాడు. నమ్మి వెళ్లిన తనని మోసం చేశాడంటూ.. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.