FbTelugu

మావటికి గజరాజు తుది వీడ్కోలు

తిరువనంతపురం: నిన్నటి వరకు తన ఆలనా పాలనా చూసిన మావటి చనిపోవడంతో గజరాజు ఉద్వేగానికి లోనయ్యింది. జంతువులు, మనుషుల మధ్య విడదీయని బంధానికి ఇదోక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
తాజాగా సోషల్ మీడియాలో కేరళలోని గజరాజు కన్నీటి వీడ్కోలు వీడియో వైరల్ అవుతోంది.

ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. చనిపోయిన మావటి పేరు కున్నక్కడ్ దామోదరన్ నాయర్. 74 ఏళ్ల నాయర్ ను స్థానికులు ఓమన్ చెట్టన్ అని పిలుస్తుంటారు. ఆయన గత 6 దశాబ్దాలుగా ఏనుగుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓమన్ చెట్టన్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ శుక్రవారం నాడు తన ఇంట్లో కన్నుమూశాడు. గజరాలు పాల్ఘాట్ బ్రహ్మదత్తన్ ను మావటి నివాసానికి తీసుకువచ్చారు. విగతజీవుడిలా పడివున్న ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు ఆ ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.