FbTelugu

ఉత్తరాఖండ్ రెండో రాజధాని గైర్ సైన్

డెహ్రడూన్: ఉత్తరాఖండ్ కు అధికారికంగా నేటి నుంచి మరో రాజధాని అమల్లోకి వచ్చింది. వేసవి రాజధానిగా గైర్ సైన్ ను ప్రకటించారు.

సమ్మర్ క్యాపిటల్ గా గైర్ సైన్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. చమోలి జిల్లాలో ఉన్న గైర్ సైన్ ఉంది. గైర్ సైన్ ను వేసవి రాజధానిగా చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఈ ఏడాది మార్చి 4వ తేదీన తీర్మానం చేసింది. నూతనంగా రెండో రాజధాని ఏర్పాటు చారిత్రాత్మకమని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.