న్యూఢిల్లీ: కాశ్మీర్ లో జీ 23 నేతల సమావేశం రాజ్యసభ సీటు కోసం తప్ప మరో కారణం లేదని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ వ్యాఖ్యానించారు. వారి సమావేశానికి ఉద్దేశం ఒకటి ఉందని ఆమె పేర్కొంది.
ఇవాళ రంజీత్ రంజన్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవలే రాజ్యసభ నుంచి రిటైర్ అయిన గులాం నబీ ఆజాద్ మళ్లీ రాజ్యసభ సీటు పొందేందుకు మీటింగ్ పెట్టారన్నారు. అధిష్టానాన్ని ఇలా బెదిరించడం సరిదకాన్నారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జీ23 పేరుతో సీనియర్ నేతలు సమావేశం కావడం, రాహుల్ వ్యాఖ్యలపై చర్చించడం వెనకాల వారి ఉద్దేశం ఏంటనీ ఆమె నిలదీశారు. ఇలాంటి సమావేశాలు మంచికన్నా చెడు ఎక్కువ చేస్తాయన్నారు. పార్టీపై ప్రేమ ఉంటే సోనియా గాంధీతో నేరుగా మాట్లాడవచ్చని, బహిరంగ వేదికలపై ఉపన్యాసాలు ఇవ్వడం సరికాదని రంజీత్ రంజన్ హితవు పలికారు.