FbTelugu

సిఎం చేతిలో ఐఏఎస్ ల భవితవ్యం?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల భవితవ్యం ముఖ్యమంత్రి వైఎస్.జగన్ చేతిలో పెట్టారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలను ప్రధాన కార్యదర్శి నిర్వర్తిస్తూ వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల వార్షిక నివేదిక ఆమోదానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మరింత మెరుగైన ఫలితాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ వెల్లడించారు. వార్షిక పనితీరు నివేదికలు ఆమోదించే అధికారం ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శికి ఉండేది. ఇక నుంచి సిఎం ఆమోదం తెలుపుతారంటూ ఏపి ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఇక నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల నివేదికలు సిఎంకు పంపిస్తారు. అధికారుల పనితీరు, ప్రవర్తన మదింపు చేసే అధికారం కూడా సీఎం కు అప్పగించారు. రాష్ట్ర గవర్నర్‌ కార్యదర్శి పని తీరు నివేదిక గవర్నర్‌ ఆమోదిస్తారు. సిఎం ఆమోదించిన నివేదికల ఆధారంగానే రాష్ట్రంలో బదిలీలు, పోస్టింగ్‌లు ఉంటాయని ప్రధాన కార్యదర్శి ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.