బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి కుమారి జె.జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ ఆరోగ్యం మరింతగా దిగజారింది. కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను పరప్పన ఆగ్రహార జైలు నుంచి గురువారం సాయంత్రం తరలించారు.
బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. జ్వరం వెన్నునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడం మూలంగా ఈ సమస్య తలెత్తినట్లు వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్ చికిత్స కోసం వచ్చిన ఆమె శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావడంతో ఐసీయూకి తరలించారు. ఆరోగ్యం మరింతగా దిగజారిందని వైద్యులు తెలపడంతో తమిళనాడులోని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 27వ తేదీన ఆమె జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది.