రాంచీ : గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ(రాష్ట్రీయ జనతాదళ్) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఇవాళ మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటి వరకు ఆయన రాంచీలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించే యోచనలో ఉన్నట్టు సమాచారం. లాలూను ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపాలని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు జైలు అధికారులకు సూచించగా.. వారు అంగీకరించినట్టు తెలుస్తోంది.