FbTelugu

ఫంగస్ మందులు, టెస్టు పేరుతో సైబర్ మోసాలు

హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ రోగానికి ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుంటే మందులు పంపిస్తామని నగరానికి చెందిన నిఖిల్ రెడ్డి అనే వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు ట్రాప్ చేశారు. అతని నుంచి రూ.4.5 లక్షలు ట్రాన్స్ ఫర్ చేయించుకుని నిండా ముంచేశారు.

నగరంలో కరోనా ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టు ఇంటికే వచ్చి చేస్తామని చెప్పి మరో వ్యక్తిని సైబర్ ఛీటర్స్ మోసం చేశారు. ఇంటికే వచ్చి చేస్తామని చెప్పి ఘాన్సీ బజార్ కు చెందిన గణపతి వసంతరావు పాటిల్ అనే వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు వలలో వేసుకున్నారు. మొబైల్ కి లింక్ పంపించి ఒకసారి రూ.1లక్ష తీసుకున్నారు. ఆ తరువాత డెబిడ్ కార్డు  వివరాలు తీసుకుని నాలుగు విడతలుగా రూ.50 వేల చొప్పున మొత్తం మూడు లక్షలు కాజేశారు. ఈ విషయం తెలుసుకుని గణపతి లబోదిమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.