FbTelugu

అంత్యక్రియలు.. 3 నెలల తరువాత ప్రత్యక్షం!

తిరువనంతపురం: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడిదేనని అంత్యక్రియలు నిర్వహించిన తల్లిదండ్రులకు తాజాగా కుమారుడే కళ్లెదుట ప్రత్యక్షం కావడంతో కంగుతిన్నారు.

కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలోని కుదస్సనాడులో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సాబూ తిరువనంతపురంలో క్యాటరింగ్ పనులతో పాటు బస్సు శుభ్రం చేసే పనులు నిర్వహించేవాడు. అతను పనిచేసే హోటల్ లో చోరీ జరగ్గా, యజమాని ఫిర్యాదు మేరకు గతేడాది పోలీసులు సాబూను అరెస్టు చేశారు. కుమారుడు అరెస్టు అయ్యాడనే విషయం తప్ప తల్లిదండ్రులకు మిగతా విషయాలు తెలియవు. డిసెంబర్ 24న కొట్టాయం జిల్లా పాలా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోగా, సాబూదేనంటూ తల్లిదండ్రులకు అప్పగించారు. వారు స్వగ్రామంలో అంత్యక్రియలు కూడా నిర్వహించారు. శుక్రవారం నాడు ఒక బస్సు డ్రైవర్ కు సాబూ భౌతికంగా కన్పించడంతో ఆశ్చర్యపోయాడు. పూర్తిగా పరిశీలించి, సాబూ అని నిర్థారించుకున్న తరువాత పోలీసులు, తల్లిదండ్రులకు తెలిపాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సాబూను అదుపులోకి తీసుకు తల్లిదండ్రులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఎవరనేదానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.