FbTelugu

కలికాలం… బొమ్మలకు అంత్యక్రియలు!

డెహ్రాడూన్: ధౌలిగంగ, అలకానంద నదుల మంచు చరియల కారణంగా చమోలి జిల్లాలోని తపోవన్, రేని ప్రాంతాల్లో జలప్రళయం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 200 మందికి పైగా గల్లంతయ్యారు.
ఘటన జరిగి వారం రోజులు అవుతుండగా ఇప్పటి దాకా 58 మృత దేహాలను వెలికి తీశారు. ఇందులో 29 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరో 146 మంది ఆచూకి తెలియాల్సి ఉంది. మృతదేహాల కోసం ఐటీబీపీ, ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్టీపీసీ బృందాలు వారం రోజులుగా ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. బురద, ఇసుక మేటలు పేరుకుపోవడం, వాతావరణం అనుకూలించకపోవడం మూలంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.

తమవారి మృత దేహాల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా ప్రాంతంలో పడిగాపులు కాస్తున్నారు. ఎవరిదైనా మృతదేహం కన్పించగానే తమవారిదేమోనని ఆశగా దగ్గరకు వెళ్లి చూసి తిరిగి వస్తున్నారు. వారం రోజులు అవుతున్న మృతదేహాలు లభ్యం కాకపోవడం వారిలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇక్కడి జౌన్సారీ తెగల సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి 14 రోజుల్లోగా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. చనిపోయిన వారి ఆకృతితో ఉన్న బొమ్మలను తయారు చేయించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.