FbTelugu

అంత్యక్రియల ఎఫెక్ట్… 28 మందికి కరోనా!

కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు ఇప్పటి వరకు 28 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. మిగతావారికి కూడా టెస్టులు చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి అంత్యక్రియల్లో బంధువులు పాల్గొన్నారు. పాల్గొన్న నాలుగైదు రోజుల తరువాత వారిలో అనారోగ్యం లక్షణాలు కన్పించడంతో ఒకరిద్దరు డాక్టర్ దగ్గరకు వెళ్లారు. పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. తమకు వైరస్ సోకిందని, మీరు కూడా పరీక్షలు చేయించుకోవాలని అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని సూచించారు. గురువారం నుంచి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి టెస్టులు చేస్తున్నారు. ఒక్క రోజు పరీక్షలోనే 16 మందికి కరోనా పాజిటివ్ రాకా.. ఇవాళ్టి టెస్టుల్లో మరో 12 మందికి కరోనా వైరస్ నిర్థారణ అయ్యింది.

మిగతవారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్నావరు ఎవరెవరిని కలిశారనే, ఎక్కడకు వెళ్లారనే వివరాలు సేకరిస్తున్నారు. చేగుర్తితో పాటు పక్కనే ఉన్న దుర్శేడు గ్రామానికి చెందిన కొందరు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.