FbTelugu

మానవత్వం మంటకలిసింది

మచిలీపట్నం: కరోనా పాజిటివ్ తో తండ్రి చనిపోగా అంత్యక్రియలు నిర్వహించకుండా సొంత కుమారుడే చేతులెత్తేశాడు. సమాచార మంత్రి పేర్ని నాని స్పందించడంతో మృతుడి భార్య తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది.

మచిలీపట్నం మాచవరానికి చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి కరోనా వ్యాధి సోకి చికిత్స తీసుకుంటున్నాడు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని అంత్యక్రియలక సిద్ధం చేయగా ఆయన కుమారుడు తనకేమి సంబంధంలేదని చేతులేత్తేశాడు. పైగా ఇంటివద్ద మృతదేహన్ని వదిలేసి వెళ్లిపోయాడు. మంత్రి పేర్నినానికి ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలిసింది. ఆయన వెంటనే స్పందించి, దహన సంస్కారాలకు అవసరమైన ఆర్ధిక సహాయం అందజేశారు. ఇరుగుపొరుగువారి సాయం ప్రసాద్‌ భార్య నాగమణి భర్తకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడా చోటు చేసుకోవడం మానవత్వానికే మచ్చగా మిగులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ముస్లింలు… బ్రాహ్మణులు కరోనాతో చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.