FbTelugu

రేపటి నుంచి పూర్తిస్థాయిలో మెట్రో సేవలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో మెట్రో రైలు సేవలు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో నడుపుతున్నారు.

హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు సోమవారం నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారికంగా ప్రకటించింది. చివరి స్టేషన్‌ నుంచి రాత్రి 9 గంటలకు మెట్రో ఉంటుందని పేర్కొన్నది. ప్రయాణికులు కరోనా జాగ్రత్తలతో ప్రయాణించాలని సూచించింది. మాస్క్‌, భౌతిక దూరం, శానిటైజర్‌ తప్పనిసరిగా వినియోగించాలని ప్రయాణీకులను హైదరాబాద్‌ మెట్రో కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.