FbTelugu

యూకేలో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్

లండన్: కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్ ను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. స్ట్రెయిన్ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుండడంతో బ్రిటన్ లో మరో మారు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించారు. కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు.

వైరస్ వ్యాప్తి దృష్యా ఇప్పటికే బ్రిటన్ నుంచి విమాన సర్వీసులను అనేక దేశాలు నిలిపివేశాయి. ఈ వైరస్ భారత్ లో నూ క్రమంగా వ్యాపిస్తోంది. ఢిల్లీలో కొత్తకేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. నేటికి భారత్ లో మొత్తం స్ట్రెయిన్ కేసుల సంఖ్య 38 కి చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.