FbTelugu

బెంగాల్ లో ఫుల్ లాక్ డౌన్

కొలకతా: సెకండ్ వేవ్ ఉధృతిలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది.

పశ్చిమ బెంగాల్ లో రేపటి నుంచి మే నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. అత్యవసర సేవలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. బెంగాల్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నడూ లేని విధంగా ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించింది. దీనిపై దేశంలోని పలు బిజేపియేతర రాజకీయ పార్టీలు విమర్శించాయి. కరోనా సమయంలో ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించడం ఏంటని మండిపడ్డాయి. ఈ ఎన్నికల కారణంగానే బెంగాల్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కరోనా పాజిటివ్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిఎం కుమారి మమతా బెనర్జీ తమ్ముడు అషీమ్ బెనర్జీ ఇవాళే చనిపోయిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.