FbTelugu

అలకల నుంచి ఆత్మహత్యల దాకా..!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు అన్ని పార్టీల్లోనూ కాక పుట్టిస్తున్నాయి. కార్పొరేటర్‌ స్థానానికి పోటీపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎవరికి సీటు ఇవ్వాలో తేల్చుకోలేక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. కార్యకర్తలు కూడా తమ పార్టీలో సీటు రాకుంటే పక్క పార్టీలోకి దూకుదామన్న ఆలోచనలతో ఉన్నారు. దీంతో ఎవరు ఏ పార్టీ నుంచి అభ్యర్థిగా రంగం మీదకు వస్తారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దాదాపు అన్ని పార్టీలూ ఇప్పటికే మొదటి జాబితాను ప్రకటించాయి. దీంతో అక్కడ సీట్లు దక్కని వారు ఆందోళలనకు, అలకలకు దిగుతున్నారు. కొందరు పక్క పార్టీలోకి వెళ్లి అక్కడ సీటు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

మరికొందరు ఒక అడుగు ముందుకేసి టికెట్‌ దక్కలేదన్న ఆవేదనతో ఆత్మహత్యా యత్నానికి కూడా పాల్పడుతున్నారు. ముషీరాబాద్‌ డివిజన్‌ నుంచి బీజేపీ టికెట్‌ తనకే ఇవ్వాలని ఆ పార్టీ మీడియా సెల్‌ ఇన్‌చార్జి శివ ముదిరాజ్‌ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముషీరాబాద్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. కార్యకర్తలు, పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసనకు దిగాడు. వాస్తవానికి ఆ టికెట్‌ వేరేవారికి ఇస్తున్నట్టు ప్రచారం జరగడంతో తనకు టికెట్‌ రావడం లేదని భావించిన శివ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇలా అనేక మంది నాయకులు ఎప్పటినుంచో టికెట్‌ మీద ఆశలు పెట్టుకొని తీరా అవి దక్కక పోవడంతో వేర్వేరు పద్ధతుల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల ద్వారా పార్టీపై ఒత్తిడి పెంచేలా చేస్తున్నారు. ఇలా పార్టీ టికెట్‌ కోసం అలకలు, ఆందోళనలు, ఆత్మహత్యల దాకా పరిస్థితి వెళ్లడంతో హైదరాబాద్‌లో రాజకీయ కాక మరింత వేడి పుట్టిస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.