FbTelugu

ఇక నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే బోధన

From-now-on-teaching-English-medium

ఆధ్రప్రదేశ్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 1-8 తరగతుల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దుచేసి, ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆపై ఏడాది 9, 10 తరగతుల్లోనూ తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ నిర్ణయం వలన అన్ని పాఠ్యాంశాలనూ ఆంగ్లంలోనే బోధించనున్నారు. అయితే.. ఆయా పాఠశాలలను అనుసరించి తెలుగు, ఉర్దూలను తప్పనిసరి సబ్జెక్టులుగా బోధిస్తారు. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులను తీర్చి దిద్దే విధంగా 1-8 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. కాగా ఈ నిర్ణయాన్ని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్‌) తప్పుబట్టింది. మాతృభాషను రద్దు చేయడం సమంజసం కాదన్నారు.

You might also like