FbTelugu

కూపన్ల కోసం ఘర్షణ.. రైతు మృతి

కడప: వేరుశనగ కాయల కూపన్లకోసం రైతుల మధ్య ఘర్షన జరిగి ఓ రైతు మృతి చెంది, మరో ముగ్గురు రైతులకు తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని చిన్నమండెం మండలం, వడ్డెపల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. వేరుశనగకాయల కూపన్ల కోసం రైతులు కట్టులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఓ రైతు మృతి చెందాడు. మరో ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలైనాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like