FbTelugu

ఫ్రెంచ్ బిలియనీర్ ను ఎలక్ట్రిక్ తాళ్లతో కట్టేసి చోరీ

ప్యారిస్: ప్రముఖ ఫ్రెంచ్ వ్యాపారవేత్త, బిలియనీర్, మాజీ మంత్రి బెర్నార్డ్ టాఫీ దంపతులు తృటిలో అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో మిగిలారు. డొమినిక్ టాఫీ ప్రమాదం నుంచి తప్పించుకుని పొరుగువారి సాయంతో పోలీసులకు ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
బెర్నాల్డ్ టాఫీ (78), ఆయన భార్య డొమినిక్ టాఫీ విలాసవంతమైన మౌలిన్ డి బ్రూల్ లో నివాసం ఉంటుంన్నారు. వీరి భవనంలోకి ఆదివారం నాడు నలుగురు గజదొంగలు ప్రవేశించారు. ఆ తరువాత టాఫీ దంపతులను ఎలక్ట్రిక్ తాళ్లతో కట్టేసి తమ పని చక్కబెట్టారు. అతి ఖరీదైన రోలెక్స్ గడియారాలు, డైమండ్ ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

బెర్నార్డ్ అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ కారణంగా కేసులు విచారణ వాయిదా పడింది. త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నారు. 1992 లో ఫ్రాంకోయిస్ మిట్టర్ రాండ్ ప్రభుత్వంలో బెర్నార్డ్ మంతిగా పనిచేసి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అవినీతి, మోసం, కార్పొరేట్ ఆస్తుల దుర్వినియోగం లాంటి కేసులలో దోషిగా తేలాడు. ఈ కేసులలో ఐదు నెలలు జైలు శిక్ష అనుభవించి 1997లో విడుదల అయ్యాడు. 1993 లో అడిడాస్ స్పోర్ట్స్ కంపెనీలో తన వాటాను విక్రయించి పెద్ద దుమారమే సృష్టించారు. ఫ్రాన్స్ ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్ లో ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా అనేక వివాదాల్లో చిక్కకున్న బెర్నార్డ్ ను చివరకు దోపిడి దొంగలు కూడా వదిలిపెట్టకపోవడం గమనార్హం.

You might also like

Leave A Reply

Your email address will not be published.