FbTelugu

యూపి, పంజాబ్ ఎన్నికల కోసమే ఫ్రీ వ్యాక్సిన్

బెంగాల్, తమిళనాడు, కేరళ ఓటమితో గుణపాఠం
జాతినుద్ధేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుండడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సినేషన్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఓటమి చెందడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

జూన్ 21వ తేదీ నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించింద ప్రకటించారు. కేంద్రమే కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని, రాష్ట్రాలు నయాపైస పెట్టాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పునరుద్ఘాటించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై పలుసార్లు ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించగా, కొరతపై అనేక రాష్ట్రాలు ప్రశ్నించాయన్నారు. వ్యాక్సిన్ల భారం నుంచి రాష్ట్రాలకు పూర్తిగా విముక్తి కల్పిస్తున్నామని మోదీ అన్నారు.

ఈ ఏడాది నవంబర్ నెలాఖరు కు 80 శాతం మందికి డబుల్ డోసు ఇస్తామన్నారు. సొంత ఖర్చుతో వ్యాక్సిన్ వేసుకునేవారికి ప్రైవేటులో అవకాశం కల్పిస్తామని, ప్రైవేటు హాస్పిటళ్లలో 25శాతం వ్యాక్సిన్లు లభ్యమవుతాయన్నారు. రూ.150 సర్వీసు ఛార్జీ చెల్లించి ప్రైవేటులో వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచామని, వీటి సరఫరాకు వైమానిక, నౌకా, రైల్వేల సేవలను పూర్తిగా వినియోగించుకున్నామన్నారు. దేశంలో ఏడు కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయని, మరో మూడు కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయన్నారు. చిన్నారుల కోసం కూడా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయని, త్వరలోనే మార్కెట్ లోకి విడుదలవుతుందని ప్రధాని మోదీ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.