FbTelugu

1నుంచి ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచితం

లుధియానా: రాష్ట్రంలో మహిళలు, బాలికలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే పథకం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1.31 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ తెలిపారు.

ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఫొటోను అమరీందర్ సింగ్ ట్విటర్ లో షేర్ చేశారు. మహిళలు, బాలికలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మహిళా సాధికారికతకు ఇది బలమైన అడుగు అని నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందనిస్తోందని సిఎం ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.