FbTelugu

8 అంబూలెన్స్ లతో ఉచిత సర్వీసు: జగ్గారెడ్డి

సంగారెడ్డి: నియోజకవర్గ ప్రజల కోసం 8  అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. మూడు రోజుల్లో సంగారెడ్డి నియోజకవర్గంలోని 4 మండలాలు, 2 మున్సిపాలిటీ లకు 8 అంబూలెన్స్ లను సమకూర్చుతానన్నారు.

నియోజకవర్గంలో కరోనా లేదా ఇతర ఎమర్జెన్సీ ఉన్నవారు అంబులెన్స్ లు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ అంబులెన్స్ సర్వీస్ ఉచితం అని, ఈ సర్వీస్ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఎంత రాత్రైనా, ఏ గ్రామం నుండైన సరే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందన్నారు. సంగారెడ్డి లోని ఏ హాస్పిటల్ కైనా లేదా ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సౌకర్యాన్ని ప్రతి గ్రామ, మండలంతో పాటు మున్సిపాలిటీ లో ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని జగ్గారెడ్డి కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.