FbTelugu

ఉచితమైన ఇసుక.. నేడు భారమైంది: చంద్రబాబు

అమరావతి : గతంలో ఉచితంగా లభించిన ఇసుక నేడు సామాన్యులు కొనలేని విధంగా భారమైంది టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇసుక ధరలు పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా ఉపాధి కొల్పోయారంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య వలన 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం అవినీతి విధానం అని పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ ఒప్పుకున్నారని ఆరోపించారు. సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.