అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇసుక తరలింపు విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇసుక రీచ్ ల నుండి గృహ అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా పొందేలా ఆదేశాలు అయ్యాయి. ప్రభుత్వ గృహ నిర్మాణాలు, పునరావాస నిర్మాణాలకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఇకనుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక సరఫరా కు అనుమతించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను బుక్ చేసుకున్నవారికి అనుమతిస్తారు.