FbTelugu

మేము గెలిస్తే ఇంటింటికి ఫ్రీ కరెంటు

న్యూఢిల్లీ: పంజాబ్ ఓటర్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఊహించని వరం ఇచ్చాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఇంటింటికి ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ లో నిత్యావసర సరకుల ధరలు మండిపోవడంతో అక్కడి మహిళలు సంతోషంగా లేరని ఆయన అన్నారు. ఢిల్లీలో నెలకు 200 యూనిట్లు అంతకన్నా తక్కువగా వినియోగించే వారికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చి లో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.