FbTelugu

ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలి: లోకేశ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం హయాంలో తీసుకొచ్చిన ఎన్టీఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ బోర్లకు మీటర్లు అమర్చితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రైతాంగాన్ని జగన్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. నష్టపోయిన ప్రతిరైతుకూ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.