FbTelugu

60ఏళ్లు పైబడిన వారికి ఉచిత దర్శనం: సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు ఉచిత దర్శనం 30 నిమిషాల్లో కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే దీని కోసం రెండు సమయాలు కేటాయించినట్లు తెలిపారు.
ఉదయం 10 గంటలకు ఒకసారి
సాయంత్రం 3 గంటలకు ఒకసారి
ఫొటోతో ఉన్న వయస్సు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకుని భక్తులు ఎస్‌-1 కౌంటర్‌ వద్ద చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే మెట్లు ఎక్కాల్సిన పనిలేదని, కూర్చోవడానికి మంచి సీట్లు ఏర్పాటు చేసి ఉంటాయని తెలిపారు. సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. రూ.20కి రెండు లడ్డు టోకెన్లు ఇవ్వనున్నట్టు, భక్తులు ఇంకా లడ్డూలు కావాలనుకుంటే రూ.25కు ఒక లడ్డూ చొప్పున ఎన్నైనా టోకెన్లు పొందవచ్చని తెలిపారు. కౌంటర్‌ నుంచి గుడికి – గుడి నుంచి కౌంటర్‌ వరకు బ్యాటరీ కారులో ఉచితంగా చేరవేయనున్నట్టు తెలిపారు. వీరి దర్శనం కోసం అన్ని క్యూలైన్లు నిలిపివేయబడుతాయని తెలిపారు. ఎటువంటి వత్తిళ్లు, తోపులాటలు లేకుండా 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More