FbTelugu

కెసిఆర్ కార్యదర్శినంటూ మోసం

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యక్తిగత కార్యదర్శిని అంటూ ఒక వ్యక్తి ఏకంగా జ్యోతిష్యుడినే మోసం చేశాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూకట్ పల్లిలో స్థలం ఇప్పిస్తానంటూ రూ.25 లక్షలు గుంజేసి, ఆపై తుపాకితో బెదిరించాడు.
ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్ నగర్ స్వస్తిక్ ప్లాజా లోని హిమాలయ బుక్ స్టోర్ పై అంతస్తులో దేవీ శైలేంద్రనాథ్ ఉంటున్నాడు.

ఈయన వద్దకు సుధాకర్ అనే వ్యక్తి వచ్చి, తను ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్ను. పలుమార్లు వచ్చి జాతకం చూపించుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు గన్ మెన్లు కూడా వచ్చేవారు. కూకట్ పల్లిలో స్థలం ఇప్పిస్తానని చెప్పాగా, శైలేంద్రనాథ్ కూడా నమ్మాడు. 2019 నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా రూ.25 లక్షలు చెల్లించాడు. రెండేళ్లు అవుతున్నా స్థలం రాకపోగా, సరైన సమాధానం చెప్పకపోవడంతో సుధాకర్ ను శైలేంద్రనాథ్ నిలదీశాడు. గట్టిగా ప్రశ్నించడంతో చంపేస్తానంటూ తుపాకీతో బెదిరింపులకు గురిచేయడంతో ఆయన ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.