FbTelugu

సినీ నిర్మాతకు వ్యాక్సిన్ పేరుతో బురిడీ

హైదరాబాద్: ఆఖరికి సినిమా నిర్మాతలు కూడా కేటుగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. కరోనా వ్యాక్సిన్ పేరుతో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబును ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు.

వ్యాక్సిన్ సరఫరా కోసం నాగార్జున రెడ్డి అనే వ్యక్తి సురేష్ బాబుకు ఫోన్ చేశాడు. తన వద్ద 500 డోసుల వ్యాక్సిన్లు ఉన్నాయని చెప్పగా సురేష్ బాబు గుడ్డిగా నమ్మి ఒకే చెప్పాడు. అతని మాటలను నమ్మిన సురేష్ ఎవరినీ ఆలోచించకుండా అతని భార్య లక్ష్మీ బ్యాంకు ఖాతాలోకి రూ.1లక్ష బదిలీ చేశాడు. డబ్బులు వేసిన తరువాత వ్యాక్సిన్లు రాకపోవడంతో సురేష్ బాబు అతనికి ఫోన్లు చేయసాగాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో విసుగుచెంది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సురేష్ బాబు అసిస్టెంట్  రాజేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.